ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2024 (13:25 IST)

శేఖర్ తనపై దాడి చేశాడని లావణ్య... లావణ్య తనపై దాడికి యత్నించిందని శేఖర్... పరస్పర ఫిర్యాదులు

rajtarun lavanya
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ - నటి లావణ్య కేసు కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా, లావణ్య పరస్పరం జూబ్లీ హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శేఖర్ తనపై దాడి చేశాడని లావణ్య... లావణ్యే తనపై దాడి యత్నించిందని శేఖర్ తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, శేఖర్ బాషా ఓ యూట్యూబ్ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చ సందర్భంగా ఆయన పదేపదే లావణ్యపై ఆరోపణలు చేస్తుండటంతో ప్రశ్నించేందుకు లాణ్య అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేస్తూ బాషాపై తనపై దాడికి పాల్పడడమే కాకుండా అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించింది. బాషా కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తూ తనపై దాడికి యత్నించిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, రాణ్ తరుణ్, తాను, 11 యేళ్ళుగా రిలేషన్‌లో ఉన్నామని, ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ఉంది.