శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (20:18 IST)

హీరో రాజ్‌ తరుణ్‌ పురుషోత్తముడు అనిపించుకున్నాడా! - రివ్యూ రిపోర్ట్

Purushothamudu poster
Purushothamudu poster
నటీనటులు : రాజ్ తరుణ్, హాసినీ సుధీర్, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, విరాన్ ముత్తంశెట్టి, ముకేష్ ఖన్నా, ప్రవీణ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య తదితరులు
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ - పీజీ విందా, మ్యూజిక్ - గోపీ సుందర్, సాహిత్యం - చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, బాలాజీ, పూర్ణాచారి, నిర్మాతలు - డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్, రచన, దర్శకత్వం - రామ్ భీమన
 
లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న రాజ్‌ తరుణ్‌ ఇటీవల వ్యక్తిగత వివాదాలతో కూరుకుపోయారు. అలాంటి టైంలో ఆయన నటించిన సినిమా నేడు విడుదలయింది. `పురుషోత్తముడు`గా చక్కటి టైటిల్ తో సినిమా ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. 
 
కథః 
రామ్‌ (రాజ్‌ తరుణ్‌)  హైదరాబాద్లో ఇండస్ట్రీస్‌ కుటుంబానికి చెందిన కొడుకు. ఫారిన్ లో చదువు అయిపోగానే కంపెనీకి సీఈవో గా ఎంపిక కావాలి. అయితే ఫారిన్ నుంచి వచ్చిన రామ్ కు తన పెదమ్మ (రమ్యకృష్ణ‌) కొడుకు పోటీ వస్తాడు. ఇక్కడి విషయాలు పెద్దగా తెలియవు కనుక సీఈవో కావాలంటే వంద రోజులు ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ మనిషిలా బతికి  ఆ పోస్ట్ ను దక్కించుకోవాలనే షరతు పెద్దలు పెడతారు. దాంతో సవాల్ గా స్వీకరించిన రామ్, వైజాగ్‌ ట్రైన్‌ ఎక్కి మధ్యలో ఓ మారుమూల గ్రామానికి చేరతాడు. అక్కడ అమ్ములు(హాసినీ సుధీర్‌) తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుంది. అసలు పని మర్చిపోయి అక్కడ అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యే కొడుకుతో పోరాటానికి దిగుతాడు? ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు తన వచ్చిన పని ఏమిటి? దానిని వదిలేసి ఆ ఊరిలో రామ్ చేసిన పోరాటం ఎటువంటి ఫలితాన్ని ఇచ్చింది? అనేది మిగిలిన కథ.  
 
సమీక్ష:
ఈ కథ చూడగానే పలు సినిమాలు గుర్తుకు వస్తాయి. దానికితోడు వర్తమానంలో బిగ్ షాట్స్ తన పిల్లలను ఒక ఊరునుంచి మరొక ఊరుకు పంపి తన స్థాయిని చెప్పకుండా బిజినెస్ మెళకువలు నేర్చుకోవడం ఇటీవల చాలా ఉదంతాలు చూశాం. అయితే పురుషోత్తముడులో మాత్రం తను ఎవరనేది రామ్ తెలీయకుండా జాగ్రత్తపడాలి. ఇది రామాయణంలో పాండవులు వనవాసం తరహాలో దర్శకుడు రాసుకున్నట్లు కనిపిస్తుంది. రాజ్ తరుణ్ తో పెద్ద చిత్రం తీయడం విశేషమే. ఆమధ్య నాగార్జున `నా సామి రంగా`లో ఓ పాత్రలో నటించాడు రాజ్ తరుణ్. ఇది ఫుల్ లెంగ్త్ హీరోగా చేశాడు. టైటిల్ కు తగినట్లు తాను ఫురుషులలో ఉత్తముడు అని నిరూపించుకునేందుకు పలు ఉప కథలు దర్శకుడు రాసుకున్నాడు.  కొన్ని సందర్భాల్లో పలు సినిమాలను ఒకే తెరపై చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ సరికొత్త ఎమోషన్స్ తో సినిమాని నడిపించడం, రక్తికట్టించేలా డ్రామాని తెరకెక్కించడం ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. 
 
రాజ్‌ తరుణ్‌ గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామానికి వెళ్లేంత వరకు సీరియస్‌గా, ఎమోషనల్ సాగిన సినిమా, ఆ ఊరు వెళ్లాక, హీరోయిన్‌, కమెడియన్‌ ప్రవీన్‌ పాత్రలు ఎంట్రీ తర్వాత ఫన్నీవేలో సాగుతుంది.  హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ సైతం ఆకట్టుకునేలా ఉంది. సెకండాఫ్‌లో కథ కాస్త సీరియస్ గా మారుతుంది. రాజ్‌ తరుణ్‌ రైతు సమస్యలతో ఇన్ వాల్వ్ కావడం పోలీసులు అరెస్ట్ వరకు రావడం వంటివన్నీ సిఇ.ఓ. బాధ్యతగా నెరవేర్చడానికి ఉపయోగపడేలా దర్శకుడు యూజ్ చేయడం బాగుంది.  సినిమాలో చాలా వరకు డ్రామా పండింది, యాక్షన్‌ సీన్లలో రాజ్‌ తరుణ్‌ బాగా చేసినా స్థాయికి మించి ఫైట్లు వున్నట్లు ఒక్కోసారి అనిపిస్తుంది. అందుకే ఎమోషన్స్ విషయంలో దర్శకుడు చాలా ఫోకస్‌ పెట్టాడు. వాటిని కొత్తగానే ప్రజెంట్ చేశాడు. పతాక సన్నివేశం బాగా ఆకట్టుకునేలా వుంటుంది. 
 
దర్శకుడు రాజ్ తరుణ్ టేకింగ్ షాట్స్ ఇతరత్రా వేరియేషన్స్ చూపించిన తీరు బాగుంది. అమ్ములుగా హాసినీ సుధీర్‌ బాగున్నా పల్లెటూరి అమ్మాయిగా ఇంకాస్త నటిస్తే బాగుండేది. రమ్యకృష్ణ పాత్రలో బాహుబలి తరహాలో నెగెటివ్, పాజిటివ్‌ షేడ్స్ వున్నాయి. మురళీశర్మ, బ్రహ్మానందం,  బ్రహ్మాజీ, రచ్చ రవి, ప్రవీణ్‌, రాజా రవీంద్ర పాత్రలకు సరిపోయారు.  ముఖేష్‌ ఖన్నా,  ప్రకాష్‌రాజ్‌ పాత్రలు సర్‌ప్రైజింగ్‌గా వుంటాయి. 
 
సాంకేతికంగా చూస్తే, సంగీతంతో గోపీసుందర్‌ స్థాయిని పెంచాడు.  పెద్ద స్టార్‌ హీరో సినిమా స్థాయిని ప్రతింబించేలా నిర్మాణ విలువలు వున్నాయి.  దర్శకుడు రామ్‌ భీమన తను రాసుకున్న కథ పాతదే అయినా దాన్ని మరింత మలుపులతో తీస్తే బాగుండేది. మీనా సినిమాను  త్రివిక్రమ్ అ..ఆ.. గా తీసినా దానిలో జిమ్మిక్కు బాగా చేశాడు.  అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సినిమా మరింత రేంజ్ లో వుండేది. 
రేటింగ్‌ : 2.5/5