బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (17:15 IST)

తాను పురుషోత్తముడు అని రాజ్ తరుణ్ నిరూపించుకునే అవకాశం వుందా?

Raj Tarun
Raj Tarun
సినీరంగంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా వున్నది కథానాయకుడు రాజ్ తరుణ్ మాత్రమే. వ్యక్తిగతంగా లావణ్య తో సహజీవం ఆ తర్వాత విడిపోయానడం, ఆమె కోర్టుకు వెళ్ళడం. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం తెలిసిందే. పోలీసు విచారణ కూడా రాజ్ తరుణ్ హాజరు కాలేదు. ఇలాంటి టైంలో ఆయనకు రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి తిరగబడరా సామి. ప్లాప్ లో వున్న రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రాబోతుంది. మరొకటి పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు.
 
అయితే ఈ సినిమాల ప్రమోషన్ కు రాజ్ తరుణ్ రాలేడు. వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఆయనకు ఎదురైంది. కనుక తనకు తానే తన జీవితం కోసం తిరగబడాలి. దానితోపాటు తాను పురుషోత్తముడు అనిపించుకోవాలి. ఈ రెండు జరగాలంటే ఆయనకు ఇండస్ట్రీ పెద్దలెవరైనా నడుం కట్టుకోవాలి. అంత సాహసం చేసే స్థితిలో ఎవరూ లేరు. సో.. రాజ్ తరుణ్ ఎరా ముగిసినట్లేనా.. అనేది ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.