బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (16:26 IST)

ఫ్రెంచ్ గడ్డంతో, రగ్గడ్ అవతార్‌లో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలో సూర్య లుక్

Suriya look
Suriya look
హీరో సూర్య గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో కొత్త సినిమా చేస్తున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి చెందిన స్పెషల్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.  "“Somewhere in the sea…”..." అనే వర్డ్స్ తో గ్లింప్స్ ప్రారంభమైయింది. హీరో డెన్ రాయల్ ఎస్టేట్ బయట గ్యాంగ్ మెంబర్స్  అతని రాక కోసం ఎదురుచూస్తుంటారు. “A love, a laughter, a war, awaits for you, the one!”అనే టెక్స్ట్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
 
ఫ్రెంచ్ గడ్డంతో, సూర్య రగ్గడ్ అవతార్‌లో స్టైల్‌గా డెన్ నుంచి బయటకు వచ్చారు. ఒకరిపై గన్ గురిపెట్టి సూర్య, థియేటర్లలో ఇంటెన్స్ మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రామిస్ చేశారు.
 
సూర్య బాడ్ యాష్  గా కనిపించారు. గ్యాంగ్‌స్టర్‌గా అతని స్ట్రాంగ్  స్క్రీన్ ప్రెజెన్స్ థ్రిల్లింగ్ రైడ్‌కు హామీ ఇస్తుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.
 
ఈ చిత్రానికి స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్