సంబంధిత వార్తలు
- గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం
- పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?
- కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరికల్ సాంగ్ విడుదల
- పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి
- ఏపీలో ఎమ్మెల్సీ పోస్టుల భర్తీ.. రేసులో వర్మ.. నాగబాబు..?
విడాకుల తర్వాత నిహారిక కొణిదెల జీవితం ఎలా వుంది?
మెగా డాటర్ నిహారిక కొణిదెల 2023లో భర్త చైతన్య నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. విడిపోయిన బాధ గురించి ఆలోచించకుండా, నిహారిక తన వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టడం, తన సన్నిహిత కుటుంబంతో మళ్లీ కనెక్ట్ అవ్వడం చేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. "నేను వైద్యం కోసం సమయాన్ని వృథా చేయడం లేదు. నేను పనిలో బిజీగా ఉన్నాను, పని చేస్తున్నాను. నా వదిన లావణ్య త్రిపాఠితో పరిశ్రమ గురించి కబుర్లు చెబుతూ ఎక్కువ సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా వున్నానని.. విడాకుల పరిణామాలను అంత సులభంగా తీసుకోలేమని కూడా స్పష్టం చేసింది. కానీ నేను బాధితురాలిని కాదు.
విడాకుల తర్వాత జీవితం విక్టిమ్‌లా ఉండదు, కానీ నేను సింపథీ ప్లే చేయాలనుకోలేదు. అన్నింటికంటే నాకు అండగా నిలిచిన నా కుటుంబం, ముఖ్యంగా మా నాన్న నాగబాబు మద్దతు ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని" అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి నిహారిక గతం గురించి ఆలోచించే బదులు, భవిష్యత్తు, తన వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెడుతుంది
తర్వాతి కథనం
