సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (12:31 IST)

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

Trivikram,arjun,arvind
Trivikram,arjun,arvind
పుష్ప 2 సినిమా షూటింగ్ కొంతభాగం అయ్యాక అడ్డంకులు మొదలయ్యాయి. ఒకరకంగా చెప్పాలంటే గడ్డు పరిస్థితులే ఎదుర్కొంటోంది. అల్లు అర్జున్ పక్కన వున్న కేశవ అనే నటుడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఆయన లేకుండా కాంబినేషన్ కుదరదు. అది మొదటి అడ్డంకి.. తర్వాత హెవీ బడ్జెట్ సినిమా. ఒకటి రెండు సార్లు ఆలోచించి తీశారు. అలా నిడివి ఎక్కువ తీయడం.. దాన్ని ఎడిటింగ్ లో తీయడం జరుగుతుంది. సినిమా ముగింపు అయ్యే  సరికి నాగబాబు, నీహారిక ఎపిసోడ్ బ్రేక్ చేసిందనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. 
 
అదెలాగంటే.. ఆంధ్ర ఎలక్షన్ లో నంద్యాల అభ్యర్థికి నర్మగర్భంగా అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడమే. నీ వెనుక నేనున్నాను అనేలా చేశాడు.  అది చిరంజీవి అభిమానులకేకాదు. పవన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
 
ఎందుకంటే  టాలీవుడ్ లో మొదటి నుంచీ సినిమా హీరోను దేవుడిగా ఫ్యాన్స్ భావిస్తారు. తమ అభిమాను హీరో సినిమా విడుదలకు ముందు కటౌట్లు, పూల మాలలు, పాలాభిషేకం., గుండు గీయించుకోవడం వగైరా వంటివి చేసేవారు. దేనికైనా అండదండగా వుండేది అభిమానులే. 
 
ఇక చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చాక డాన్స్ తో అందరినీ ఆకట్టుకునేలా చేశాడు. ఆయన్ను మొదట ఆదర్శంగా తీసుకున్న మేనల్లుడు అల్లు అర్జున్ క్రమేణా ఆలోచనలు మారాయి. మెగా కాంపౌండ్ వాడిగా ఎంతవరకు వుండగలను? తనకంటూ ఒక స్టయిల్ తెచ్చుకోవాలని వుందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. తనకంటూ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకునేలా పలు సినిమాలు చేశాడు. రానురాను అల వైకుంఠపురంలో హైప్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని పుష్ప సినిమాకు దర్శకుడు సుకుమార్ యూత్ ఐకాన్ బిరుదు ఆాపాదించాడు. ఆ బలంతో నిదానంగా అల్లు స్టూడియోస్ ను నెలకొల్పారు. అల్లు ఆర్ట్స్ కూడా బేనర్ స్థాపించేలా చేసుకున్నాడు. 
 
అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడితే అల్లు అర్జున్ వ్యతిరేక పార్టీకి ఇచ్చిన సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో నెగెటివ్ గా మారింది.
 
మెగా కుటుంబంలో నెగెటివ్ గా వుండేది నాగబాబు మాత్రమే నని విశ్లేషకులు అంచనావేశారు. మెగా కుటుంబంలో ఎవరిపైనా ఏది మాట్లాడినా ముందుగా రియాక్ట్ అయ్యేది నాగబాబు మాత్రమే. దాని వల్ల చాలాసార్లు వ్యతిరేకత తెచ్చుకున్నాడు కూడా. మా ఎన్నికల్లో అది మరింత ముదిరింది. 
 
ఇది పక్కన పెడితే  పవన్ కళ్యాన్ ఎన్నికల్లో పోటీచేస్తున్న టైంలో.. అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో .. మన వాళ్ళు ఎవరు? బయటి వారు ఎవరు? అనేది ఇప్పుడు తెలిసింది. అని నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద ఎఫెక్ట్ వచ్చేలా చేసింది. దాంతో అభిమానులు పూర్తిగా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా మారారు.
 
దానికితోడు మరో కీలకమైన అంశం ఏమంటే... పుష్ప 2 లో నీహారిక నటించింది. కొంత భాగం పూర్తయ్యాక ఆంధ్ర ఎలక్షన్లు రావడంతో  అల్లు అర్జున్ స్టేట్ మెంట్  మెగా ఫ్యామిలీలో వ్యతిరేకత రావడం జరిగింది. ఆ తర్వాత నీహారిక కంటెన్యూ షెడ్యూల్ చేయకుండా వాయిదా వేస్తుందనే ఫిలిం నగర్ టాక్.
 
దాంతో పుష్ప సీక్వెల్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఆమె పాత్రను తీసేసి మరో నటితో చేయించడానికి దర్శకుడు సిద్ధమయ్యాడు. సాయిపల్లవి చేస్తందా? మరొకరు చేస్తున్నారా? నేది ఇంకా క్లారిటీ రాలేదు. దాంతో ఆగస్టులో జరగాల్సిన రిలీజ్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది. దానికితోడు ఎలక్షన్ల ఎపెక్ట్ తో  విడుదలకు దగ్గరబడినా కొనేవారు వెనుకంజ వేస్తున్నారు. అందుకే మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.
 
మొత్తంగా చూస్తే, పుష్ప 2 ఒకవేళ ఆడకపోతే నష్టపోయేది అల్లు అర్జున్ కాదు. నిర్మాత, దర్శకులు, టెక్నీషియన్ కే  బాధపడాల్సి వస్తుంది. కోట్లు పెట్టి తీసిన నిర్మాతకు పెద్ద లాస్. ఏది ఏమైనా అన్నీ సవ్యంగా జరిగి విడుదలకు నోచుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.