ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (12:56 IST)

రచయిత కార్తీక్ తీడా రాసుకున్న రియల్ స్టోరీగా నాగచైతన్య బిగ్గెస్ట్ చిత్రం తండెల్

Naga Chaitanya    Karthik Theeda
Naga Chaitanya Karthik Theeda
హీరో నాగచైతన్య కెరియర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం తండెల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగచైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్. సినిమా విడుదలకు ముందే పూర్తి మార్కెటింగ్ చేసుకొంది. నాగచైతన్యకు ఈ సినిమా మంచి హిట్టుగా నిలుస్తుందని ఇదివరకే వెలువడిన ప్రచార చిత్రాలు, టీజర్, పోస్టర్లు చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ  మూవీకి కథే బలం. మరి ఇలాంటి కథను కార్తీక్ తీడా అనే రచయిత అందించారు. 
 
దాదాపు 70% పూర్తి చేసుకున్న తండెల్ సినిమా ఇప్పుడు చివరి షెడ్యూల్ కోసం శ్రీకాకుళంలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ కథ నేపథ్యం శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి గత 2,3 రోజుల నుంచి రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. 2018 లో జరిగిన రియల్ కథను శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రచయిత కార్తీక్ తీడా ఎంతో రీసెర్చ్ చేశారు. ఫిషర్ మాన్స్ తో 2, 3 నెలలు స్వయంగా ఉండీ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో ఒకడిగా ఉంటూ, వారితో ప్రయాణం చేస్తూ వారి జీవన శైలీని పూర్తిగా తెలుసుకున్నారు.
 
సముద్రంలో వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు, కస్టమ్స్ తో వాళ్లకున్న కష్టాలు, సవాళ్లు అన్ని పరిశీలించారు. అలా రాజు, బుజ్జిల కథను అత్యద్భుతంగా, సినిమాటిక్ విజన్ తో తీర్చిదిద్దారు. తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో స్టోరీని వినిపించగా కథ నచ్చడంతో ఇప్పుడు రూపం దాల్చుకుంది. రచయిత కార్తీక్ తీడా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఈ తరుణంలోనే శ్రీకాకుళంలో జరిగిన యదార్ధ సంఘటనను సినిమాగా రాయాలి అనే సంకల్పంతో తండెల్ కథ మొదలుపెట్టి అత్యద్భుతంగా రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రాజుగా నాగచైతన్య నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బుజ్జి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ప్రచార చిత్రాలు చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీలో గ్రాండ్ హిట్ కొడుతుంది అనే నమ్మకం కలిగింది. ఈ చిత్రంతో నాగచైతన్య కెరియర్ బీఫోర్ తండేల్ ఆఫ్టర్ తండేల్ గా ఉండబోతుందన్న వైబ్స్ కనిపిస్తున్నాయి.