ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (15:10 IST)

శోభిత ధూళిపాళతో ప్రేమలో చైతూ.. యూరప్‌ టూర్‌‌లో ఇద్దరు..

Nagachaitanya_Shobitha
అక్కినేని హీరో.. నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే గత కొన్నాళ్లుగా చైతూ టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నారంటూ ఫిల్మ్ నగర్‌లో ప్రచారం సాగుతోంది. తాజాగా మరోసారి చైతూ, శోభిత పేర్లు వార్తల్లో నిలిచాయి. ఈ ఇద్దరికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. 
 
చైతు, శోభిత ఇద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్లారు. యూరప్‌ టూర్‌లో ఉన్నారు. ఇక వీరిద్దరూ అక్కడ ఉన్న ఓ బార్‌లో వైన్ టెస్టింగ్ సెషన్‌లో పాల్గొన్నట్లుగా ఉన్న ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. చైతూ, శోభితా చాలా రోజులుగా కలిసే వెకేషన్ వెళ్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. చైతూ అభిమానులు మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంటూ రియాక్ట్ అవుతున్నారు.