ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (17:19 IST)

నాగ చైతన్య, సాయి పల్లవి పై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ

Sai Pallavi Birthday Celebrations
Sai Pallavi Birthday Celebrations
నాగ చైతన్య, సాయి పల్లవి జోడి ఇంతకు ముందు 'లవ్ స్టోరీ'తో  ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'తండేల్' లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
Sai Pallavi Birthday Celebrations
Sai Pallavi Birthday Celebrations
ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవిపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
 
సెట్ లో  సాయి పల్లవి బర్త్ డే సెలబ్రేషన్స్ ని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్ లో హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి, చిత్ర సమర్పకులు అల్లు అరవింద్, చిత్ర యూనిట్ పాల్గొని సాయి పల్లవికి బర్త్ డే విషెస్ తెలియజేశారు.
 
సాయి పల్లవి బర్త్ డే సందర్భం గా విడుదల చేసిన రెండు పోస్టర్లు, స్పెషల్ వీడియో గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లు, స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
నాగచైతన్య, సాయిపల్లవి జోడి మరో సారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో 'తండేల్' అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతోంది. ఇందులో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించనున్నారు. క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, శామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.