1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (10:56 IST)

సమంతతో ఆన్ స్క్రీన్ రొమాన్స్... నాగ చైతన్య హ్యాపీ హ్యాపీ

Akkineni Nagarjuna,manam
2014లో విడుదలైన మనం, తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా నిలిచింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారు కనిపించారు. రీసెంట్‌గా రీ-రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల నుండి ఆదరణ పొందింది. 
 
గురువారం రాత్రి దేవి 70 ఎంఎంలో జరిగిన స్పెషల్ షోకు చిత్ర దర్శకుడితో కలిసి నాగ చైతన్య హాజరయ్యారు. ఈ షో పట్ల ప్రత్యేక అభిమానాన్ని వ్యక్తం చేశారు అభిమానులు. ఇక నాగ చైతన్య, సమంతలకు వుండే ఆదరణ  ఎప్పటికీ ప్రత్యేకం.
 
కొన్ని వీడియోలలో, నాగ చైతన్య తన మాజీ భార్య సమంతతో తన ఆన్-స్క్రీన్ రొమాన్స్‌ను చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీలయ్యాడు. చైతన్య- సమంతా 2021లో విడిపోయినప్పటికీ వారి కెమిస్ట్రీని తెరపై చూసి హర్షం వ్యక్తం చేశారు.