1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (12:53 IST)

అక్కినేని కుటుంబం ఇంటికి సమంత తిరిగి వెళ్తుందా?

chaitu
నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని ఎవరి మటుకు వారు సినిమా షూటింగులతో చాలా బిజీగా వున్నారు. ఐతే వారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇద్దరినీ రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించేవారు మాత్రం వుంటూనే వున్నారు. ఈమధ్య వీళ్లద్దర్నీ వేర్వేరుగా తమతమ రెండో పెళ్లి విషయమై అడిగితే... తాము సినిమాలతో బిజీగా వున్నామనీ పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పేసారు. దీనితో మళ్లీ నాగచైతన్య-సమంత కలిసిపోతారనే చర్చ ప్రారంభమైంది.
 
ఈ చర్చకు బలం చేకూరుస్తూ అక్కినేని నాగార్జున కుటుంబంలోని ఇంట్లో హాల్లో వెళ్లగానే ఓ పెద్ద ఫోటో దర్శనమిస్తోందట. ఆ ఫోటోలో అక్కినేని నాగచైతన్య-సమంత పెళ్లి చేసుకున్నప్పుడు కుటుంబం అంతా కలిసి దిగిన ఫోటోనట అది. ప్రత్యేకంగా హాల్లో వున్న ఫోటోలో సమంత కూడా వుండటమూ, అక్కినేని ఫ్యామిలీకి సమంత తిరిగి నాగచైతన్యతో కలిసి జీవితం సాగించాలనే కోరిక వుందని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి వుంది.