శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (17:40 IST)

నాగ చైతన్యకు భయపెట్టే విషయాలు అవే

Naga Chaitanya
Naga Chaitanya
అక్కినేని నాగచైతన్యకు కొన్ని విషయాలు భయపెట్టిస్తాయి. అందుకే వాటి జోలికి వెళ్ళడు. అవి ఏమిటంటే తన దగ్గరకు ఎవరైనా కథలు చెప్పడానికి వస్తే హార్రర్ కథలు వున్నాయంటే ఫోన్ కట్ చేస్తాడు. అసలు తాను హార్రర్ సినిమాలు చూడను అని తేల్చిచెప్పాడు. అలాంటి చైతన్య దగ్గరకు మనం సినిమా తీసిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఓ కథను తీసుకువస్తే తిరస్కరించాడు. అందుకే ఆయన పల్స్ తెలిసిన వాడు కాబట్టి ధూత అనే కథను తీసుకువచ్చి ఓటీటీలో విడుదల చేస్తున్నాడు.
 
అమెజాన్ ప్రైమ్ లో 240 భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇందుకు చాలా ఆనందంగా వుందని దర్శకుడు తెలిపాడు. ధూత అనే సినిమా కథ సూపర్ నేచురల్ పవర్ తో కూడుకుంది. ఇందులో చైతన్య ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించాడు. ఆయనకు సూపర్ నేచురల్ పవర్ కు లింక్ ఏమిటి? అన్నది చూసి తెలుసుకోవాల్సిందే అని దర్శకుడు చెప్పాడు. ఇది నాలుగు భాగాలుగా రాసుకున్నానని అన్నారు.