గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (15:28 IST)

సమంతతో రొమాన్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేసిన సాయి ధరమ్ తేజ్

Samantha-sai tej
Samantha-sai tej
'ఏ మాయ చేసావే'లోని జెస్సీ పాత్ర సినీ ప్రేమికుల జ్ఞాపకంలో నిలిచిపోయింది. ఆ రొమాంటిక్ క్లాసిక్‌తో యువకుల హృదయాలను దోచుకుంది సమంతా రూత్ ప్రభు, ఈ చిత్రంతో సూపర్-క్యూట్ తొలి నటిగా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమెతో నటించాలని చాలా మంది అనుకుంటారు. సమంతను ఇష్టపడే వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు.
 
చిత్ర పరిశ్రమలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇన్ స్ట్రాలో అభిమానులతో ఇటీవల చిట్-చాట్ సందర్భంగా, సాయి తేజ్ అందమైన నటితో ఎప్పుడు పని చేస్తారని అడిగారు.  జెస్సీతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు రిప్లై వచ్చింది.
 
'రిపబ్లిక్' హీరో సాయితేజ్ సమంతను తన అభిమాన కథానాయికగా భావిస్తాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో రొమాంటిక్ సినిమా చేయాలని భావిస్తాడు. మరి సమంత ఏమంటుందో చూడాలి.