సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (23:19 IST)

పొగలు కక్కే చలిలో సామ్ ట్రీట్‏మెంట్.. ఎంత కష్టమో..!

Samantha
Samantha
మయోసైటిస్ అనే ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతోంది హీరోయిన్ సమంత. తాజాగా తన ట్రీట్‌మెంట్‌లో భాగంగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమంత మయోసైటిస్ చికిత్సలో భాగంగా.. క్రయోథెరపీ అనే సివియర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. 
 
పొగలు కక్కే -150 డిగ్రీల ఫారెన్ హీట్‌లోని ఓ టబ్‌లో కూర్చుని ఉంది సామ్. ఇక ఈ థెరపీ గురించి ఈ విధంగా రాసుకొచ్చింది. "ఈ చికిత్స రోగనిరోధక శక్తిని పెంచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, హార్మోన్లను ప్రేరేపించడానికి సహాయం చేస్తుంది. కొంతకాలం శరీరాన్ని చల్లని వాతావారణంలో ఉండేలా చేయాలి" అంటూ వివరించింది. 
Samantha
Samantha
 
దీంతో ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతకు ఎంత కష్టం వచ్చిందని, ఇంత కఠినమైన ట్రీట్‌మెంట్‌ను సామ్ ఎలా భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.