1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (10:31 IST)

రూ.కోటి మోసపోయిన 'ఖుషి' హీరోయిన్

samanta
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర హీరోయిన్లలో ఒకరైన సమంత తన వ్యక్తిగత మేనేజర్ కారణంగా కోటి రూపాయల మేరకు మోసపోయింది. ఆమెకు తెలియకుండా దాదాపు కోటి రూపాయలను కొట్టేయడానికి ఆ మేనేజరు కుట్ర పన్నినట్టు తేలింది. ఈ విషయాన్ని పసిగట్టిన సమంత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటంపై ఆమె తట్టుకోలేకపోతుంది. పైగా, అతని స్థానంలో మరో మేనేజర్‌ను నియమించుకునే దిశగా ఆమె దృష్టిసారించింది. 
 
కాగా, ప్రస్తుతం సమంత టాలీవుడ్ సంచనలం విజయ్ దేవరకొండతో కలిసి "ఖుషి" చిత్రంలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీ శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. సమంత చివరగా శాకుంతలం చిత్రంలో నటించారు. కాగా, ఇదే మేనేజరు గతంలో హీరోయిన్ రష్మిక మందన్నాను కూడా మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.