సల్మాన్ ఖాన్ సరసన సమంత.. పంజా దర్శకుడితో కలిసి..?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించే ఆఫర్‌ను సమంత కొట్టేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ "సిటాడెల్" హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ విడుదల త్వరలో విడుదల కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సమంత కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పుష్ప చిత్రంలో ప్రత్యేక పాటతో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైన సమంత ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో పంజా సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా, కరణ్ జొహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సమంత పేరు తెరపైకి వచ్చింది.
కాగా ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే జవాన్ ద్వారా నయనతార, లవ్ స్టోరీ హిందీ రీమేక్ ద్వారా సాయిపల్లవి, తాజాగా సమంత సల్మాన్ ఖాన్‌తో నటించేందుకు సిద్ధం అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.