ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (16:26 IST)

సమంతకు విల్ పవర్ ఎక్కువ.. చాలా హార్డ్ వర్కర్: మాజీ భర్త

samanta
నాగ చైతన్య తనతో పనిచేసిన హీరోయిన్లలో తనకు నచ్చే క్వాలిటీస్ గల హీరోయిన్స్ గురించి వివరించాడు. ఈ ఇంటర్వ్యూలో కృతి శెట్టి, పూజా హెగ్డేతో పాటు మాజీ భార్య సమంతలో తనకు నచ్చిన లక్షణాల గురించి నాగ చైతన్య మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. 
 
సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తి చేస్తుందని కొనియాడాడు. నాగ చైతన్య మాజీ భార్య సమంతను మరోసారి లాగి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. సమంత చాలా హార్డ్ వర్కర్ అని, విల్ పవర్ ఎక్కువ అని నాగ చైతన్య రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సమంతపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 
 
నాగ చైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకున్నారు. 
 
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ఇటీవల సమంత రొమాంటిక్ డ్రామా ఖుషీలో కనిపించింది. ఇందులో విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. 
 
ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది.
 
 చైతూ, సమంత కలిసి ఆటోనగర్ సూర్య (2014), మనం (2014), మజిలీ (2019) చిత్రాల్లో నటించారు.