ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (11:21 IST)

రష్మిక వీడియో.. ఆలోచిస్తేనే భయం కలుగుతోంది.. నాగ చైతన్య

Rashmika Mandanna
ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో.. అమితాబ్ బచ్చన్ సహా పలువురు సెలబ్రిటీలు ఈ చర్యను తప్పుపట్టారు. 
 
తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య స్పందించాడు. టెక్నాలజీ ఎలా దుర్వినియోగం అవుతోందో చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని నాగచైతన్య చెప్పాడు. 
 
భవిష్యత్తులో ఈ దుర్వినియోగం ఏ స్థాయికి పోతుందో అని ఆలోచిస్తేనే భయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. రష్మికకు బలం చేకూరాలని ఆకాంక్షించాడు.