1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (12:37 IST)

పుష్ప 2 చిత్రం షూట్ హైదరాబాద్ షెడ్యూల్ తాజా అప్ డేట్

Pupsha poster
Pupsha poster
పుష్ప 2 చిత్రం షూట్ గత కొద్దికాలంగా పలు చోట్ల జరిగింది. తాజా షెడ్యూల్ వరుణ్ తేజ్ వివాహం వల్ల అల్లు అర్జున్ విరామం తీసుకున్నారు. ఈలోగా కొంత షెడ్యూల్ ను దర్శకుడు సుకుమార్ ఇతర నటీనటులపై చిత్రికరిస్తున్నారు. కాగా, మరోవైపు చిత్రానికి సంబంధించిన వి.ఎఫ్.క్స్ పనులు కూడా మరోవైపు అడుగులు పడ్డాయి.
 
ఇక పుష్ప 2 తాజా షూటింగ్ హైదరాబాద్ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన సెట్ ఏర్పాట్లు జరిగాయి. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ చేయనున్నారు. రామ్ లక్ష్మణ్ లతోపాటు పీటర్ హెయిన్స్, విదేశీ ఫైటర్లు పాల్గొనున్నారు. 
 
ఈ చిత్రం లో రష్మిక మందన్న, ఫాహద్ ఫజిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.