సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (12:13 IST)

రష్మిక మందన్న ఫేక్ వీడియో.. కఠిన చర్యలు తీసుకోండన్న అమితాబ్

Rashmika
నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృత్రిమ మేధ సాంకేతికత వికృత పోకడలకు దారి తీస్తోంది. 
 
ఇందులో భాగంగా నెట్టింట రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్‌గా మారిన ఓ ఫేక్ వీడియోలో నిందితులు, ఏఐ సాయంతో రష్మిక ముఖాన్ని కురచదుస్తులు ధరించిన ఓ మహిళకు మార్ఫింగ్ చేశారు. 
 
వీడియోపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన చెలరేగడంతో ఓ జర్నలిస్టు వాస్తవాన్ని బయటపెట్టారు. అది డీప్ ఫేక్ ఏఐ సాంకేతికతతో తయారు చేసినదని నెటిజన్లను అప్రమత్తం చేశారు. సెలబ్రిటీలను అపఖ్యాతి పాల్జేస్తున్న నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.