1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Samantha breaks the boundaries in boldness, mind blocking pose in a bikini

బ్లాక్ డిజైనర్ దుస్తుల్లో మెరిసిన సమంత..

Samantha
Samantha
ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ సమంత రూత్ ప్రభుపై ఫోటో షూట్ చేసింది. సమంత బ్లాక్ డిజైనర్ దుస్తుల్లో సూపర్ హాట్‌గా కనిపించింది. బికినీ లాంటి డ్రెస్‌లో హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేసింది. ఆమె హాట్ అవతార్ సోషల్ మీడియాను షేక్ చేసింది. 
 
ఈ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలను పంచుకుంది. మీ జీవితంలోని ఒడిదుడుకులకు మీ స్పందన ఏమిటని అడిగినప్పుడు, ఆమె ఇలా సమాధానమిచ్చింది: విడాకులు, అనారోగ్యం నన్ను నిజంగా విచ్ఛిన్నం చేసింది. ఈ పరిణామాలు నా పనిపై ప్రతికూల ప్రభావం చూపాయి.
 
ఈ క్లిష్ట పరిస్థితుల్లో నాలాంటి సమస్యలతో బాధపడుతున్న నటుల జీవితాల గురించి నేను చదివాను. వాళ్లు ఎలా పోరాడి గెలిచారో తెలుసుకున్నాను. ఇది నాకు చాలా సహాయపడింది. అభిమానులు ఇష్టపడే నటి కావడం ఒక బహుమతి. 
 
కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి. మన నిజ జీవితాలను వారితో పంచుకోవాలి. ఎన్ని హిట్లు, బ్లాక్ బస్టర్లు కొట్టాం? మనకు ఎన్ని అవార్డులు వచ్చాయి? మనం ఎంత అందంగా ఉన్నాం. మనం ఎలాంటి బట్టలు వేసుకున్నామన్నది ముఖ్యం కాదు. 
 
నా సమస్యలపై పోరాడతానని నాకు తెలుసు. నాలాగా బాధపడేవారికి దాన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి. మీరు కంటిన్యూగా పోరాడాల్సిందే అంటూ సమంత సుదీర్ఘ సమాధానాన్ని పోస్ట్ చేసింది.
తర్వాతి కథనం
సలార్‌లో సిమ్రత్ కౌర్.. స్టెప్పులు ఇరగదీస్తుందట..!