సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (10:05 IST)

బిగ్ బాస్-7: సత్యభామ ప్రొమోషన్ కోసం టాలీవుడ్ చందమామ

Bigg Boss 7 Season
బిగ్ బాస్ తెలుగు వారాంతపు ఎపిసోడ్‌కు కాజల్ అగర్వాల్ అతిథిగా వస్తోంది. కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ మూవీ సత్యభామ టీజర్‌ని బిగ్ బాస్ హౌస్‌లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. నాగార్జునతో హౌస్‌లో సందడి చేయడమే కాకుండా, కాజల్ కంటెస్టెంట్స్‌తో కొన్ని ఆటలు ఆడుతుందని వార్తలు వచ్చాయి. 
 
అభిమానులను అలరించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ప్రత్యేకంగా కాజల్ ఎపిసోడ్‌ని డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శుక్ర‌వారం టీజ‌ర్ విడుద‌ల చేసినా, కాజ‌ల్ ఎపిసోడ్ శ‌నివారం టెలికాస్ట్ అవుతుంద‌ని అంటున్నారు. 
 
ఈ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్‌తో పాటు చిత్ర సమర్పకుడు శశికిరణ్ తిక్క, దర్శకుడు సందీప్ కూడా హాజరు కానున్నారు. కాజల్ రీసెంట్‌గా భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా కోసం తొలిసారి బాలకృష్ణతో రొమాన్స్ చేసింది. కాజల్ అగర్వాల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సక్సెస్ క్రెడిట్ కాజల్‌కి దక్కలేదు. 
 
ఆ లోటును సత్యభామ భర్తీ చేస్తుందని కాజల్ భావిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.