రాజ్ తరుణ్‌కి ఫోన్ చేస్తే మాల్వి ఎత్తడం.. తిండికి డబ్బులు వెయ్యడం..?: లావణ్య
Lavanya
ఈ నేపథ్యంలో లావణ్య శనివారం ప్రెస్‌మీట్ పెట్టింది. రాజ్ తరుణ్ తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తనతో వస్తాడో, రాడో కానీ వస్తాడనే ట్రై చేస్తున్నానని వెల్లడించింది. ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్, కామెంట్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నానని తెలిపింది.
రాజ్ తరుణ్‌కు ఫోన్ చేస్తే మాల్వి మల్హోత్రా ఎత్తడం, తను చెప్తేనే మాకు తిండికి డబ్బులు వెయ్యడం చేసేవాడని లావణ్య ఆరోపించింది. తను మెంటల్లీ ఇల్ అని నిరూపించేందుకు ప్రయత్నించాడని.. సినిమాలలో ఇంట్రస్టా అంటూ తనే తనను అప్రోచ్ అయ్యాడని.. తాను అడ్వకేట్ అని.. సినిమాలంటే తనకు ఆసక్తి లేదని చెప్పానని లావణ్య వెల్లడించింది. అసలు మీడియా, కెమెరాల ముందు రావడం అంటే వణుకు అని.. ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్‌పై కేసు పెట్టడానికి.. ఆయన తిరిగి తనకు దక్కాలనే పోరాటం తప్ప వేరొకటి లేదని లావణ్య స్పష్టం చేసింది.
రాజ్ తరుణ్ నా ప్రపంచం.. వస్తాడో, రాడో కానీ వస్తాడనే ట్రై చేస్తున్నాను.
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
ఈ యూట్యూబ్ థంబ్నెయిల్స్, కామెంట్స్ చూస్తే తట్టుకోలేకపోతున్నాను.
రాజ్ తరుణ్‌కు ఫోన్ చేస్తే మాల్వి మల్హోత్రా ఎత్తడం, తను చెప్తేనే మాకు తిండికి డబ్బులు వెయ్యడం చేసేవాడు - లావణ్య pic.twitter.com/gac9Pa5CEn
