1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 జులై 2024 (16:12 IST)

హీరో రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్ : పోలీసులకు ఆధారాలు సమర్పించిన ప్రియురాలు లావణ్య!!

Raj Tarun's Ex-Lover Lavanya
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి వెలుగుచూసింది. రాజ్‌ తరుణ్‌తో పదేళ్లపాటు సహజీవనం చేసిన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించారు. దాంతో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 493, తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
కాగా, కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడిన రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ షార్ట్ ఫిలిం నటి లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలకు తగిన ఆధారాలు అందించాలని పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో ఆమె తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు.
 
రాజ్ తరుణ్‌తో పదేళ్ల క్రితమే పెళ్లయిందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య వెల్లడించారు. లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో కలిసి ఉంటున్నామని, అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్‌తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని చెప్పారు. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపారు.
 
"మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడు. మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబై కూడా వెళ్లడంతో నేను ప్రశ్నించాను. ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాయిస్ రికార్డు చేశాడు" అని లావణ్య పేర్కొంది.