శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 మే 2024 (23:31 IST)

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. కారణం ఏంటో తెలుసా?

Alllu Arjun
Alllu Arjun
ఐకాన్ స్టార్, పుష్ప హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అనుమతి లేకుండా జనసమీకరణ చేశారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారని రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. 
 
కాగా, తన స్నేహితుడు అయిన శిల్పారవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అల్లు అర్జున్ ఇవాళ నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొదట శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
శిల్పారవి తనకు మంచి మిత్రుడని, తనకు పార్టీలతో సంబంధం లేదన్న బన్నీ.. కేవలం శిల్పా రవితో ఉన్న వ్యక్తిగత స్నేహంతోనే నంద్యాలకు రావడం జరిగిందని వివరించారు. శిల్పా రవి వద్దన్నా తానే తనను అభినందించడానికి, విషెస్ చెప్పడానికి నంద్యాల వచ్చానని తెలిపారు.