బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 మే 2024 (17:46 IST)

నంద్యాలలో వై.సి.పి. అభ్యర్థి రవి చంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ ప్రచారం

Allu arjun at Nadhyala
Allu arjun at Nadhyala
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూనే మరోవైపు నంద్యాలలో పవన్ కు వ్యతిరేక వర్గం అయిన వైసిపి అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం విశేషం. ఈరోజు నంద్యాలకు తన భార్యతో హాజరై జనసముద్రం ముందు అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి చేయి పట్టుకుని గెలిపించమని అల్లు అర్జున్ కోరడం జరిగింది. ఇది సోషల్ మీడియాలో పెద్దహాట్ టాపిక్ గా మారింది. ఇదే రోజు రామ్ చరణ్, తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్ళి అభిమానులను ఉత్సాహపరిచారు.
 
నంద్యాల ప్రజల నుండి విపరీతమైన ప్రేమ & చీర్స్ అందుకున్నాడు. అల్లు అర్జున్. రాబోయే ఎన్నికలలో MLA అభ్యర్థిగా పోటీ చేస్తున్న రవి చంద్ర కిషోర్ రెడ్డికి తన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. రవి చంద్ర కిషోర్ రెడ్డి స్నేహితుడని అల్లు అర్జున్ చెబుతున్నా, తన భార్య స్నేహారెడ్డికి దగ్గరి బంధువని తెలుస్తోంది. సో. ఒక చోట పవన్ కూ మరోచోట ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయమని కోరడం నెటిజన్టు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.