ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2024 (09:37 IST)

నా భర్త రాజ్ తరుణే... మస్తాన్ సాయితో నా బంధం ఏంటో నిరూపించుకుంటా?

rajtarun lavanya
తన భర్త రాజ్ తరుణే అని, మస్తాన్ సాయితో ఉన్న నా బంధం ఏంటో అనిరూపించుకుంటా అని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యాఖ్యానించారు. బుధవారం 
'తిరగబడరసామీ' ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర సహా చిత్ర బృందం ఈ ఈవెంట్‌లో పాల్గొంది. మరోవైపు ఈవెంట్ బయట లావణ్య విలేకరులతో మాట్లాడింది.
 
'రాజ్ తరుణ్‌ సపోర్ట్ చేసే వాళ్లందరూ కలవనీయకుండా చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకుని వెళ్లిపోతున్నాడో సమాధానం చెప్పాలి. మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం. గుడిలో నా మెడలో తాళికట్టాడు. అప్పుడు మేమిద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్న ఫొటోలు ఉన్నాయి. వాటిని కోర్టులో సమర్పించాం. అప్పుడే పిల్లలు వద్దని రెండుసార్లు అబార్షన్ చేయించాడు. పదేళ్లు కలిసి జీవించిన తర్వాత చెప్పకుండా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. నా దగ్గరకు వచ్చి 'మనం విడిపోదాం' అని కనీసం చెప్పలేదు. నన్ను మోసం చేసి, పోలీస్ కేసులో ఇరికించి పారిపోయాడు. ఈ రోజు తప్పించుకోవచ్చు. రేపు తప్పకుండా దొరుకుతాడు. ఎప్పటికైనా నాకు సమాధానం చెప్పి తీరాలి'
 
'మస్తాన్ సాయితో నా బంధం ఏంటో నిరూపించుకుంటా. ఆ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు మాల్వీ మల్హోత్రాతో రాజ్ ఏం చేస్తున్నాడన్నది నిరూపిస్తాను. వాళ్లిద్దరూ ఎక్కడకు వెళ్తున్నారు. 'మావయ్యగారు' అంటూ మాల్వీ నాన్నతో ఫోన్లు మాట్లాడుతున్నాడు. రాజ్ తరుణ్ నా కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి మేనేజర్, అసిస్టెంట్ అందరూ నన్ను బ్లాక్ చేశారు. చేయాల్సిందంతా చేసేసి, ఇప్పుడేమో మా లాయర్ మాట్లాడతాడంటే ఊరుకోను. నేను కేసు పెట్టినా రాజ్ తరుణ్ ఎందుకు అరెస్టు చేయలేదో తెలియడం లేదు. బహుశా డబ్బు, పరపతి ఉపయోగిస్తున్నాడేమో తెలియదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నా' అని లావణ్య చెప్పుకొచ్చింది.