ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2024 (14:07 IST)

నటుడు ధనుష్‌తో నాకు సంబంధం అంటగట్టడం దురదృష్టకరం : నటి మీనా

meena
సినీ నటి మీనా రెండో వివాహం చేసుకోబోతున్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, ఆమె ఈ విషయంపై పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రచారం రూమర్స్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా తన రెండో వివాహంపై ఆమె మరోమారు స్పందించారు. ముఖ్యంగా తమిళ హీరో ధనుష్‌తో తనకు సంబంధం అంటగట్టడం దారుణం, దురదృష్టకరమన్నారు. జీవితంలో ఎపుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, తన భర్త చనిపోతారని తాను అస్సలు ఊహించలేదన్నారు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదని చెప్పారు. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు. తనకో ఫ్యామిలీ ఉందని ఇలాంటి వార్తలతో తమను ఇబ్బంది పెట్టొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, కరోనా సమయంలో మీనా భర్త కాలేయం సమస్య కారణంగా చనిపోయిన విషయం తెల్సిందే. భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు ఆమె తనకు వచ్చిన ప్రతి ఒక్క సినిమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. పైగా కుమార్తె భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలాకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని తాజాగా ఆమె మరోమారు ఖండించారు.