బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (10:51 IST)

బీజేపీలో చేరనున్న సినీ నటి మీనా?

Meena
సినీ నటి మీనా రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా, ఆమె భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ తమిళ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఇందులో సినీ నటి మీనా కూడా పాల్గొని, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో నటి మీనా బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 
 
పైగా, ఈ వేడుకల్లో నటి మీనాకు బీజేపీ నేతలు అమిత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తమిళనాడు రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లిన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీంతో ఆమె బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యతను ఇచ్చారని చెబుతున్నారు. పైగా, మీనా సైతం బీజేపీలో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. 
 
కాగా, అనారోగ్యం కారణంగా ఆమె భర్త సాగర్ మృతి చెందిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె తన కుమార్తెతో కలిసి మీనా ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఒంటరి తనాన్ని దూరం చేసుకునేందుకు ఆమె రాజకీయాల్లో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.