1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (09:32 IST)

ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి పది లక్షలు స్వాహా..

Rummy
Rummy
ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి లక్షల్లో పోగొట్టుకుని, చివరికి తీవ్ర మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై మనాలి న్యూ టౌన్‌లో నివసించే బి.భవాని బీఎస్సీ పట్టభద్రురాలు. ఆమె వయసు 29 సంవత్సరాలు. ఆమెకు భర్త భక్కియరాజ్ (32), ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు.
 
ఆ పిల్లల్లో ఒకరికి మూడేళ్ల వయసు కాగా, మరొకరికి ఏడాది వయసు. భవాని ఓ ప్రైవేటు హెల్త్ కేర్ సంస్థలో పనిచేస్తుండగా, ఆమె భర్త తొరైపాక్కంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. వీరికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. 
 
అయితే భవాని కరోనా లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ రమ్మీకి బానిసగా మారింది. భవాని పేకాట పిచ్చి గమనించిన భర్త, తల్లిదండ్రులు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. 
 
వారి మాటలను పెడచెవినపెట్టిన ఆ మహిళ ఎప్పటికైనా భారీగా డబ్బు రాకపోతుందా అన్న ఆశతో ఆన్ లైన్ జూదంలో నిత్యం మునిగితేలేది. 
 
ఉన్న డబ్బంతా అయిపోగా, బంగారు నగలు తీసుకుని తాకట్టు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడింది. ఆ నగల విలువ రూ.10.5 లక్షలు. ఈసారి కూడా భవాని ఆన్ లైన్ రమ్మీలో నష్టపోయింది.  
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.