గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (16:22 IST)

హీరోయిన్ రెజీనా కాసాండ్రా గర్భందాల్చిందా?

Regina Cassandra
తెలుగు చిత్రపరిశ్రమలోని కుర్ర హీరోయిన్లలో రెజీనా కాసాండ్రా ఒకరు. ఈమె గర్భందాల్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పెళ్లికాకుండానే ఆమె గర్భందాల్చడం ఏంటనే సందేహం అనేక మందికి వచ్చింది. ఏది ఏమైనా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 
 
ప్రముఖ హాస్య నటుడు అలీ హోస్ట్‌గా వచ్చే "అలీతో సరదాగా" అనే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన రెజీనా తన గర్భం వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఓ స్వీట్ కోసమే అలాంటి అబద్ధం చెప్పాను. కర్ణాటకలో హిల్ స్టేషన్‌ దగ్గరలోని ఒక హోటల్‌లో ఉన్నా. నాకు అక్కడ దొరికే 'మిస్తీ దోయి' అనే స్వీట్‌ చాలా ఇష్టం. 
 
ఉన్నఫళంగా అది తినాలనిపించి బయటకు వచ్చా. రాత్రి 11 గంటలు అవుతోంది. అక్కడ షాప్స్‌ ఏమీ లేవు. ఒక షాప్‌ క్లోజ్‌ చేస్తుంటే అక్కడికి వెళ్లి అడిగాను. వాళ్లు ఇది క్లోజింగ్‌ టైం.. కుదరదన్నారు. 'ప్లీజ్‌ సర్‌! ప్రెగ్నెంట్‌ని..' అని అబద్ధం చెప్పా. అలా చెప్పి ఆ స్వీట్‌ కొనుక్కుని ఆరగించాను అని నవ్వుతూ చెప్పింది.