పోలీస్ ట్రైనీలుగా శాకిని డాకిని ఏం చేశారో తెలుసా!
Regina Cassandra, Niveda Thomas
రెజీనా, నివేదాలను పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకిని టీజర్ విడుదలైయింది. టీజర్ చాలా ఆసక్తికరంగా వుంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంది. అలాగే ట్రైనింగ్ లో వీరిద్దరూ వెనకబడ్డారు. పైగా అనవసరమైన గొడవల జోకిలికి వెళ్తున్నారు. టీజర్ లో ఒక క్రిమినల్ అమ్మాయి తలపై రాడ్డుతో కొట్టడం, తర్వాత రెజీనా, నివేద చేసిన కొన్ని యాక్షన్ స్టంట్స్ అసలు కథపై ఆసక్తిని పెంచాయి.
టీజర్‌ను బట్టి చూస్తే.. 'శాకిని డాకిని' ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, బలమైన కథ, డ్రామా కూడిన సినిమాని అర్ధమౌతోంది. రెజీనా, నివేదా పాత్రలు బ్రిలియంట్ గా వున్నాయి. కొన్ని సన్నివేశాలలో డేర్‌డెవిల్స్‌గా కనిపించడం ఆకట్టుకుంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు సుధీర్ వర్మ.. ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించారు.
రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం రిచ్ గా వుంది. మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్ ద్వయం తమ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేశారు. విప్లవ్ నైషధం ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ ఉన్నతంగా వుంది.
కంటెంట్, పెర్ఫార్మెన్స్ , టెక్నికల్స్‌తో టీజర్ సినిమా పై పాజిటివ్ ఇంప్రెషన్ని కలిగించింది.
నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, 'శాకిని డాకిని' సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

