సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (16:13 IST)

బి. గోపాల్, సాగర్ ఆవిష్క‌రించిన చిన్నాడెవ‌డ‌మ్మా ట్రైలర్

B. Gopal, Sagar, Tej Kurapathi, Akhila Akarshana and others
B. Gopal, Sagar, Tej Kurapathi, Akhila Akarshana and others
హుషారు చిత్రంలో న‌టించిన తేజ్ కూర‌పాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”.ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా  చిత్ర ట్రైలర్‌ను దర్శకులు బి. గోపాల్, సాగ‌ర్ విడుదల చేశారు.
 
దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ..ఈ సినిమా టైటిల్, సాంగ్స్, ట్రైలర్ అన్ని బాగున్నాయి. ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ  చాలా  హార్డ్ వర్క్ చేశారు. ఈ కథ పై ఉన్న నమ్మకంతో దర్శకుడు వెంకట్ చాలా కాన్ఫిడెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమా కథను, దర్శకుడిని నమ్మి తీసిన నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి.సినిమా కూడా చాలా బాగుంటుంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు 
 
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఒక రియ‌లిస్టిక్ ప్రేమకథను దర్శకుడు వెంకట్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు.ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు.ఫొటోగ్రఫీ  చూస్తుంటే పెద్ద సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ, వెంకట్ చెప్పిన కథ నచ్చడతో నాతో ఈ సినిమా చేయించాడు. ఈ చిత్రాన్ని ద్వారకా తిరుమలైన చిన్న తిరుపతిలో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాకు భవ్య దీప్తి రెడ్డి  మంచి రిలీక్స్ ఇచ్చారు. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారు, బస్టాప్ కోటేశ్వరరావు, అనంత్ ఇలా అందరూ బాగా నటించడమే కాకుండా వారంతా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు  వెంకట్ వందెల మాట్లాడుతూ. ఇది ఒక అందమైన ప్రేమ కథ. ఓషో లోని తత్త్వం, బుద్ధునిలోని సహనం, శ్రీ శ్రీ లోని రేవలిజం, వివేకానందుడి లోని గుణం వుండేలా తనికెళ్ళ భరణి గారి  క్యారెక్టర్ ను డైజైన్ చేయడం జరిగింది..వారితో పాటు  ఈ చిత్రానికి పని చేసిన హీరో, హీరోయిన్స్  టెక్నిషియన్స్, నటులు అందరూ ఫుల్ సపోర్ట్ చేశారని అన్నారు.
 
చిత్ర హీరో తేజ్ కూర‌పాటి, హీరోయిన్ అఖిల, పద్మిని నాగులపల్లి, శశి ప్రీతమ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు త‌దిత‌రులు మాట్లాడుతూ,  సెప్టెంబర్ 2 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని ఆకాంక్షించారు.