సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:30 IST)

గోవాలో గుండెపోటుతో మరణించిన నటి సోనాలి ఫోగట్

Sonali
Sonali
నటి సోనాలి ఫోగట్ తీవ్ర గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ గోవాలో గుండెపోటుతో మరణించారని హిస్సార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ భూపేందర్ ధ్రువీకరించారు. తన సిబ్బందితో గోవాకు వెళ్లిన ఆమె వున్నట్టుండి.. గుండెపోటుతో హఠాన్మరణం చెందారని భూపేందర్ తెలిపారు. 
 
కాగా సోనాలి ఫోగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ స్థానం నుండి పోటీ చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరి కుల్దీప్ బిష్ణోయ్‌పై పోటీ చేసింది.
 
సోనాలి ఫోగట్ సోమవారం రాత్రి హఠాన్మరణం చెందడంపై కుటుంబీకులు షాక్ అయ్యారు. బిగ్ బాస్ 14 కంటెస్టెంట్‌గా ఆమెను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆ తర్వాత ఆమెకు ఎంతో ప్రజాదరణ లభించింది. 
 
‘ఏక్ మా జో లాఖన్ కే లియే బని అమ్మ’ అనే టీవీ సీరియల్‌లో 2016లో మొదటిసారిగా సోనాలి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఆమె నటించింది. 
 
2016 డిసెంబర్ లో 42 ఏళ్ల భర్త సంజయ్ ఫోగట్ ను ఆమె కోల్పోయింది. వ్యవసాయ క్షేత్రంలో అనుమానాస్పద రీతిలో నాడు ఆయన మరణించారు. సోనాలికి ఒక కుమార్తె ఉంది.