1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BJP leader Khushbu visits Bhagya Lakshmi temple

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీ నటి ఖుష్బూ

Khushboosundar
భారతీయ జనతా పార్టీ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్ సమీపంలోని ప్రముఖ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భాగ్యనగరి వేదికగా మూడు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. 
 
ప్రస్తుతం ఈమె బీజేపీ తరుపున ఛార్మినార్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె బుధవారమే భాగ్యనగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 
 
మరోవైుపు, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు, కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు నగరానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మత్స్యకారుడి పంట పండింది.. వేలంలో రూ.13 లక్షలు పలికింది..