బుధవారం, 16 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (18:07 IST)

శ్రీవారి సేవలో 'బంగార్రాజు' దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అక్కినేని అమలలు శుక్రవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మొక్కులను చెల్లించుకున్నారు. నాగార్జున దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం తర్వాత నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి దర్శనానికి రాలేకపోయామని చెప్పారు. అందుకే ఈ రోజు స్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందినట్టు చెప్పారు. కొత్త సంవత్సరంలో ప్రపంచ ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థించినట్టు ఆయన తెప్పారు. 
 
కాగా, అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన "బంగార్రాజు" చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు.