గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (14:15 IST)

మల్బరీ పండ్లతో డయాబెటిస్ పరార్..

mulberry
mulberry
మల్బరీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ పండ్లతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ప్రస్తుతం డయాబెటిస్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అలాగే బరువు కూడా కంట్రోల్ లో ఉంచేలా మల్బరీ పండు సహాయపడుతుంది. 
 
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల వచ్చే బరువు నియంత్రించడంలో మల్బరీ ఉపయోగపడుతుంది.
 
మల్బరీ పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారానికి నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటి చూపు పెరుగుతుంది. వీటిని తరచుగా తీసుకోవడం వలన అధిక రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటిస్‌ని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయి. 
 
చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్‌ను నిరోధిస్తుంది.