శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (20:25 IST)

పుట్టగొడుగులు.. సలాడ్లు, సూప్స్‌లో బీన్స్‌ చేర్చితే...

immunity food
పోషకాల గనులైన పుట్టగొడుగులు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహార పదార్థం. ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం. ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తి మెరుగుపడటానికి విటమిన్‌-డి ఎంతో అవసరం. 
 
వీటిలో సమృద్ధంగా ఉండే పొటాషియం.. శరీరంపై సోడియం దుష్ప్రభావాలకు విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు, పొటాషియం రక్త నాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పరోక్షంగా రక్తపోటు తగ్గడానికి సాయపడుతుంది.
 
అలాగే పప్పుధాన్యాల్లో అనారోగ్యకర కొవ్వులు పెద్దగా ఉండవు. వాటిని తీసుకునే వారికి హృద్రోగాల ముప్పు 22 శాతం తక్కువ. అంతేకాదు రోజుకు ముప్పావు కప్పు బీన్స్‌ తీసుకుంటే రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు తగ్గిపోతాయి. కాబట్టి, మెరుగైన ఆరోగ్యం కోసం సలాడ్లు, సూప్స్‌లో బీన్స్‌ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.