బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (19:38 IST)

ప్రముఖ హాస్య నటుడి రాజు శ్రీవాస్తవ్ ఆరోగ్యం విషమం

raju srivastav
ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ్ ఆరోగ్యం విషమంగా మారింది. ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా ఈ నెల 10వ తేదీన గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ఆయన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పైగా, ప్రస్తుతం ఆయన మెదడు సక్రమంగా పని చేయడం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఇదిలావుంటే, 58 యేళ్ళ రాజు శ్రీవాస్తవ్ గుండెపోటుకు గురివాడంతో ఆయన హుటాహుటిన ఆస్పత్రికి తరలించి యాంజియోప్లాస్టీ చేశారు. గత 1980 నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న ఆయన 2005లో రియాలిటీ స్టాండప్ కామెడీ షో "ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్" పేరుతో తొలి సీజన్‌ను ప్రారంభించారు. 
 
ఈ షో ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.