మెగా ఫ్యాన్స్‌కు పండగే... 21 "గాడ్‌ఫాదర్" టీజర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం "గాడ్‌ఫాదర్". మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్టయిన 'లూసీఫర్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలకానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ అప్‌డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. "గాడ్‌ఫాదర్" టీజర్‌ను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో చిరు బ్లాక్ గ్లాసెస్ ధరించి క్లాస్ లుక్‌లో ఉన్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన మెగాస్టార్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, ఆర్.బి.చౌదరి, ప్రసాద్ ఎన్‌వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆగస్టు 22వ తేదీ చిరంజీవి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఇది మెగా ఫ్యాన్స్‌కు ఓ పండగ లాంటిదే. ఇపుడు ఈ పండక కంటే ముందుగానే "గాడ్‌ఫాదర్" టీజర్ రూపంలో ఒక రోజు ముందుగా సెలబ్రేషన్స్ చేసుకోనున్నారు.