శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: బుధవారం, 17 ఆగస్టు 2022 (12:57 IST)

టీఎస్ లాసెట్ ఫలితాలు.. సాయంత్రం 4 గంటలకు విడుదల

టీఎస్ లాసెట్ ఫలితాలు బుధవారం రిలీజ్ కానున్నాయి. రిజల్ట్స్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది జరిగిన లాసెట్‌ పరీక్షలకు మొత్తం 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 28,921 మంది జులై 21, 22 తేదీల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
 
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2022 రిజల్ట్స్‌ను బుధవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీ. వెంకట రమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ. రవీందర్, ప్రొ.లింబాద్రి విడుదల చేయనున్నారు.