ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:22 IST)

TS EAMCET ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఈసెట్‌ ఫలితాలను విద్యా‌శాఖ మంత్రి సబితా ఇంద్రా‌రెడ్డి జేఎ‌న్టీ‌యూ‌హె‌చ్‌లో విడు‌దల చేస్తారు. అభ్యర్థులు ఫలి‌తాల కోసం www.eamcet.tsche.ac.in, https://ecet.tsche.ac.inను చూడవచ్చు.
 
ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను జులై 18, 19, 20 తేదీల్లో, అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షలను జులై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా‌.. ప‌రీక్షకు 1,56,812 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,150 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.