బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-08-2022 గురువారం దినఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి...

astro12
మేషం :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం. క్రయ విక్రయ రంగంలోని వారికి మెళుకువ అవసరం. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలిగిపోగలవు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం :- ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయటం మంచిది. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి.
 
మిథునం :- ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయమే అన్నివిధాల శ్రేయస్కరం.
 
కర్కాటకం :- ఏజెంట్లు, బ్రోకర్లు, కలెక్షన్ ఏజెంట్లకు శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టే ఆస్కారం ఉంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావటం ఉత్తమం. ఆధ్యాత్మిక విషయాలు, పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తారు.
 
సింహం :- పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో మెలకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థినులకు తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కన్య :- శస్త్ర చికిత్స చేయునపుడు వైద్యులకు మెళుకువ అవసరం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లలలో పునరాలోచన అవసరం. ముఖ్యుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. బంధువులరాక వల్ల కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
తుల :- విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. కుటుంబ ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. అధికారుల సుదీర్ఘ సెలవుతో ఉద్యోగస్తులు నిశ్చింతకు లోనవుతారు. అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. నిరుద్యోగులకు ఉపాథి పథకాలపై ఆసక్తి మరింత పెరుగుతుంది.
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక ఖర్చులెదురైనా కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. మీ కళత్ర మొండివైఖరి మీ చికాకు కలిగిస్తుంది. బృందకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవసాయ రంగాల వారికి ఎరువులు, క్రిమి సంహారక మందుల కొనుగోళ్లలో చికాకులు, ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు :- కందులు, ఎండుమిర్చి స్టాకిస్టులు, వ్యాపారస్తులు ఒక అడుగు ముందుకు వేస్తారు. స్త్రీలు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. ఆథ్యాత్మిక విషయాలలో ఏకాగ్రత వహించలేరు. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
మకరం :- వృత్తి వ్యాపారాల్లో మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు తావివ్వకండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. మిమ్మల్ని ప్రేమించేవారిని అశ్రద్ధ చేయటం మానండి. బ్యాంకు పనులలో ఏకాగ్రత, మెళుకువ ముఖ్యమని గమనించండి. కొన్ని అవకాశాలు ప్రయత్న పూర్వకంగాను, యాధృచ్చికంగాను కలిసివస్తాయి.
 
కుంభం :- ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించబడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహారించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
మీనం :- మీ సంతానం పై చదువుల కోసం పొదుపు పథకాలు చేపడతారు. బంధువుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి కలిసివస్తుంది. మీ వాగ్దాటితో ఎదటివారిని మెప్పిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది.