ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-08-2022 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

Astrology
మేషం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులను దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. స్త్రీల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.దుబారా ఖర్చులు తగ్గించాలన్న మీ యత్నం ఫలించదు. వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం.
 
వృషభం :- వ్యాపారాల విస్తరణకు కొంత జాప్యం తప్పదు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీసంకల్పం నెరవేరుతుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. కుటుంబీకుల ప్రేమాభిమానాలు పొందగలుగుతారు.
 
మిథునం :- మందులు, ఫ్యాన్సీ, ఆల్కహాల్, కొబ్బరి, పానీయ వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యమైన పత్రాలు కనిపించక ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు.
 
కర్కాటకం :- హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకుని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి. విద్యార్థులకు విద్యావిషయాల పట్ల ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు.
 
సింహం :- ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.
 
కన్య :- మీ కృషికి గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. ఉత్సాహంతో కొత్త యత్నాలు సాగిస్తారు. పనులు, వ్యవహారాలు చురుకుగా సాగుతాయి. విలాసాలకు బాగా ధన వ్యయం చేస్తారు. విదేశీ యత్నాలు ఫలించగలవు. సోదరీ సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
తుల :- రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త అవపరం. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. పనులు నెమ్మదించినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు.
 
వృశ్చికం :- దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. అధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విలువైన వస్తువులు, వాహనం కొనుగోలుచేస్తారు.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, ఇతర ఒప్పందాలు మీకు అనుకూలంగా పరిష్కారం కాగలవు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సమయాను కూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిది.
 
మకరం :- ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు రచనలు, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుత వ్యాపారాల పైనే శ్రద్ధ వహించండి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం శ్రేయస్కరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి.
 
కుంభం :- కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మీనం :- వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం కానవస్తుంది. స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.