గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-08-2022 ఆదివారం దినఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

Astrology
మేషం :- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. సాహసకృత్యాలకు, వాదోపవాదాలకు ఇది సమయం కాదని గమనించండి. నిరుద్యోగలుకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. స్థిర బుద్ది లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విదేశీ పర్యటనల కోసం చేసే యత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ, ఏకాగ్రత వహించండి. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది.
 
కర్కాటకం :- హోటల్, తినుబండారాలు, బేకరీ వ్యాపారులకు లాభదాయకం. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. బంధువుల గురించి అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. గృహనిర్మాణాలు, మరమ్మతులలో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. చిన్నచూపు చూసిన వారే మీ ఔన్నతాన్ని గుర్తిస్తారు.
 
సింహం :- ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. మీ శ్రమ, యత్నాలు వృధా కావు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి.
 
కన్య :- బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసివస్తుంది. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకొండి. ఒక స్థాయి వ్యక్తుల కలయిక ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది.
 
తుల :- కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గుట్టుగా వ్యాపారయత్నాలు సాగించండి.
 
వృశ్చికం :- స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులుతప్పవు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.
 
ధనస్సు :- భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడపటంవల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
మకరం :- పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో శ్రద్ధ, ఆసక్తి చూపుతారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెగుతుంది.
 
కుంభం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. జకీయనాయకులకు ప్రయాణాలలోనూ, అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. 
 
మీనం :- ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులుపడుట వలన మాట పడవలసివస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విద్యార్ధుల అత్యుత్సాహం విపరీతాలకు దారితీసే ఆస్కారం ఉంది. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు.