గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-08-2022 బుధవారం దినఫలాలు - శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లైతే..

శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించిన మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
మేషం:- దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది.
 
వృషభం :- కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పు, అధికారులతో పర్యటన లుంటాయి. వాదోపవాదాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహరాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది.
 
మిథునం:- వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి గడిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు.
 
కర్కాటకం:- ఆర్ధికంగా బాగుగా స్థిరపడతారు. అధికారుల హోదా పెరగటంతో పాటు స్థానచలనం ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ పథకాలు, షాపుల అలంకరణమంచి ఫలితాలిస్తాయి. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. మిత్రులను కలుసుకుంటారు.
 
సింహం:- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసివస్తుంది. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో విజయం సాధిస్తారు.మీ సహాయంపొంది మిమ్మల్ని తక్కువ అంచనా వేయటంవల్ల ఆందోళనకు గురవుతారు. వాహనం కొనుగోలుచేస్తారు.
 
కన్య:- కొంతమంది మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. విదేశీయత్నాల్లో శ్రమాధిక్యత, ప్రయాసలకు లోనవుతారు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ట మక్కువ సన్నగిల్లుతుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
తుల:- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.
 
వృశ్చికం:- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.
 
ధనస్సు: - వ్యాపారాల్లో పోటీని దీటుగా ఎదుర్కుంటారు. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
 
మకరం:- వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆప్తులహితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఖర్చులు సామాన్యం. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం:- క్యాటరింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. బంధు మిత్రులతో సత్సబంధాలు నెలకొంటాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి.
 
మీనం:- నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.