గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-07-2022 ఆదివారం దినఫలాలు - వరసిద్ధి వినాయకుడిని పూజించిన...

simha raasi
మేషం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. 
 
వృషభం :- రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. రావలసిన ధనం అందుతుంది. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
కర్కాటకం :- స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఖర్చులు అధికం. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
సింహం :- దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. వేళతప్పి ఆహారం భుజించడం వ్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. పాత శత్రువులు మిత్రులుగా మారతారు. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి.
 
కన్య :- బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి ప్రయాణీకుతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషిస్తారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ప్రయాణాలలో ఆశించినంత ఉత్సాహంగా సాగవు.
 
వృశ్చికం :- దంపతుల మధ్య అవగాహనా లోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఒకసారి అనుకూలించని అవకాశం మరోసారి ఫలిస్తుంది. 
 
ధనస్సు :- కుటుంబీకులతో ఎకీభవించలేకపోతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. మీ మంచితనాన్ని త్వరలోనే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మకరం :- ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవటం క్షేమదాయకం. స్త్రీలకు బంధువుల తీరు ఆందోళన కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
కుంభం :- వాస్తవానికి మీరు నిదానస్తు లైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. బంధు మిత్రులతో సంబంధాలు బలపడతాయి. దూర ప్రయాణాలలో పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి.
 
మీనం :- ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది. స్త్రీలకు చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. బంధువుల రాకవల్ల చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. విందులలో పరిమితి పాటించండి. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది.