1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-07-2022 బుధవారం దినఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా..

mesham
మేషం :- ఆర్థిక లావాదేవీలు, ముఖ్యమైన చర్చలు సజావుగా సాగుతాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవకార్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
వృషభం :- పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. సంయమనంతో వ్యవహరించటంవల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఒక వ్యవహారంలో మీ శ్రీమతి ఇచ్చిన సలహా మంచి ఫలితాన్నిస్తుంది.
 
మిథునం :- ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. లౌక్యంగా మెలిగి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహరాలు వాయిదాపడటం మంచిది.
 
కర్కాటకం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బంధువుల నుంచి అక్షేపణలు, అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. కొంతమంది మీనుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. మీ ఉన్నతిని ఎదుటివారు గుర్తిస్తారు.
 
కన్య :- దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు ఏ విషయం పట్ల ఆసక్తి అంతగా ఉండదు. నిర్మాణ పనుల్లో పనివారలతో చికాకులు తప్పవు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. మిత్రుల హితోపదేశం మీపై మంచి ప్రభావం చూపుతుంది. అకాల భోజనం, శ్రమాధిక్యతవంటి చికాకులు తప్పవు.
 
తుల :- తల పెట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాకు తమ క్లయింట్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. మీ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. విద్యార్థినులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత, పాఠ్యాంశాల పట్ల అవగాహన పెంపొందుతాయి.
 
ధనస్సు :- వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత, ఓర్పు ఎంతో ముఖ్యం. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. సాహసించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి.
 
మకరం :- ఆర్థికంగా ఎదగటానికి చేయుయత్నాలు ఫలించవు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పాతబిల్లులు చెల్లిస్తారు. ఎదురుచూస్తున్న నోటీసులు, రశీదులు అందకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి సామాన్యం.
 
కుంభం :- కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రాజకీయనాయకులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
మీనం :- హామీలు, మధ్యవర్తిత్వాలు చికాకు పరుస్తాయి. తరుచు దైవకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం సంపాదిస్తారు. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. ధన సహాయం, చెల్లింపులలో అప్రమత్తత అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.