1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cyclone Akvan Updates: Landfall begins near Gopalpur

నేడు ఒరిస్సా గోపాల్ పూర్‌లో తీరందాటనున్న అక్వాన్ తుఫాను

Cyclone Akvan
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాను శుక్రవారం ఒరిస్సా రాష్ట్రంలోని గోపాల్ పూర్‌లో తీరందాటనుంది. గత ఆరు గంటల్లో 21 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వస్తున్న ఈ తుఫాను మరికొన్ని గంటల్లో గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
 
తుఫాను ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 16 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిల్లో 10 సెం.మీ, సోంపేటలో 9.2 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బంగారంలో రేడియం పౌడర్ కల్తీ : బులియన్ అసోసియేషన్ చీఫ్ ఏమంటున్నారు?