సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (11:11 IST)

దొంగను వెంబడించి పట్టుకున్న పోలీసులు అదుర్స్ (video)

Car
Car
మారుతి సుజుకి డిజైర్ కారులో ఇద్దరు వ్యక్తులు హెరాయిన్‌ను తీసుకుని వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆకారులోని వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ కారులోని వ్యక్తులు ఇరుకు రోడ్డులో వేగంగా వెళ్లిపోతుండగా వారిని పోలీసులు వెంబడించారు. 
 
ఒక చోట స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను కారుతో ఢీకొట్టి.. ఆగకుండా వెళ్లిపోతున్నాడు. ఆ సమయంలో వెనకాల వాహనంలో ఉన్న పోలీసు తుపాకితో కారు టైర్‌పై కాల్పులు జరిపాడు. అయినా ఆగకుండా అక్కడి నుంచి మరికొంత దూరం కారులో ముందుకెళ్లిపోయాడు. 
 
కారు ముందు బంపర్లు వేలాడుతున్నా ఆగలేదు. ఆకారులో వ్యక్తిని పట్టుకునేందుకు ఓ పోలీస్ పరిగెత్తడం చూసిన వారంత ఆశ్చర్యపోయారు. చివరికి దుండుగుడు దొరకడంతో కారులో తనిఖీలు చేసిన పోలీసులు పది గ్రాముల హెరాయిన్‌ని పట్టుకున్నారు. కారులో వ్యక్తులను పట్టుకున్నామని.. అయితే వారి కోసం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.